ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్:ఆగస్టు 01*
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్ర పతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ జరగనుంది.
ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్, ఆ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి జులై 21న రాజీనామా చేసిన విషయం తెలిసిందే..
వైద్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపిన లేఖలో ధన్‌ఖడ్ పేర్కొన్నారు. 2022 ఆగస్టు నెలలో ధన్‌ఖడ్ భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ వైద్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో ఈసీ తాజాగా.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7 : ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్.
ఆగస్టు 21 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.
ఆగస్టు 22 : నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25 : నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ