బీసీ ఎస్సీ ఎస్టీలకు స్ఫూర్తి సాయన్న గెలుపు

బీసీ ఎస్సీ ఎస్టీలకు స్ఫూర్తి సాయన్న గెలుపు

సారంగాపూర్

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీలకు స్ఫూర్తిగా అడెల్లీ గ్రామ సర్పంచ్ దండు సాయన్న గెలుపు అని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ యాటకారి సాయన్న ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని అడెల్లి గ్రామంలో జనరల్ స్థానంలో సర్పంచ్ గా ఎన్నికైన దండు సాయన్న కు జేఏసీ జిల్లా కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకు సమాన భాగస్వామ్యం పై ఒక అవగాహనకు వస్తుందని, రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అడెల్లి స్ఫూర్తితో అధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రామగిరి రవీందర్ మండల నాయకులు దొంతుల చంద్రశేఖర్ కల్లూరు సుధాకర్ సుంకరి రాజు చారి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment