నగరంలోని ప్రముఖ పత్రిక సంపాదకుడి ఇంట్లో సత్యనారాయణ వ్రతం
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్, నవంబర్ 16:
నిజామాబాద్ నగరంలోని రేడియో స్టేషన్ సమీపంలో నివసించే ప్రముఖ పత్రిక సంపాదకుడు బట్టు సవిత శ్రీధర్ రాజ్ వారి నివాసంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. వ్రతంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని వేదమంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రాజ్ మాట్లాడుతూ— “ప్రతి సంవత్సరం మా సహోదరులందరం కలిసి సత్యనారాయణ వ్రతం నిర్వహించడం మా కుటుంబ పరంపర. ఈ వ్రతం చేయడం వల్ల మనస్సుకు శాంతి, ఇంట్లో ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయి. మా కుటుంబం ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండేలా స్వామి కరుణ ఎల్లప్పుడూ ఉందని భావిస్తున్నాం. ప్రతి కుటుంబం ఇలాగే ఆనందంగా ఉండాలని సత్యదేవుని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.