తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: సట్టి సాయన్న

తెలంగాణ దివ్యాంగుల సమావేశం - సట్టి సాయన్న
  • దివ్యాంగుల సమస్యలపై తెలంగాణ దివ్యాంగుల జేఏసీ అత్యవసర సమావేశం
  • పెన్షన్లు రూ.416 నుంచి రూ.6000 పెంచే హామీ అమలు చేయాలని డిమాండ్
  • ఉచిత బస్సు ప్రయాణం, వివాహ ప్రోత్సాహక బహుమతి మంజూరు కోరిన జేఏసీ

నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ దివ్యాంగుల జేఏసీ అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ సట్టి సాయన్న, కో కన్వీనర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో, దివ్యాంగుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రత్యేకించి పెన్షన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, వివాహ ప్రోత్సాహక బహుమతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల జేఏసీ డిమాండ్ చేసింది. నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ సట్టి సాయన్న, రాష్ట్ర కో కన్వీనర్ ప్రవీణ్ కుమార్ పాల్గొని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

సట్టి సాయన్న మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు రూ.416 నుండి రూ.6000 పెంచుతామని హామీ ఇచ్చిందని, అలాగే ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో పాటు 2016 చట్టాన్ని అమలు చేస్తామని వెల్లడించిందని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

దివ్యాంగుల కోసం కమిటీ భవనం మంజూరు చేయాలని, పెళ్లి చేసుకునే దివ్యాంగులకు కళ్యాణలక్ష్మితో పాటు వివాహ ప్రోత్సాహక బహుమతి అందించాలని కోరారు. అంతేకాకుండా, ఉద్యోగాలు, ఆర్థిక రుణ సౌకర్యాలు తదితర అంశాలపైనా చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యనిర్వాక కార్యదర్శి టి ముత్యం, కోశాధికారికే భగవాన్, జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసయ్య, ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జిలు ఎస్కే భాస్కర్, పంచగుడి మహేష్, పూజా రెడ్డి, పాపయ్య, కే నర్సయ్య, గాంధారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment