ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను బిజెపి మండల అధ్యక్షుడు కోరిపోతన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రతను కాపాడడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉక్కు మనిషిగా ప్రత్యేకంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యువత మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దేవోజి భూమేష్, ఆర్ఎంపి అసోసియేషన్ మండల అధ్యక్షుడు చాతరాజు దుర్గాప్రసాద్, బీజేపీ నాయకులు తాటివార్ రమేష్, మోహన్ యాదవ్, ధర్మపురి శ్రీనివాస్, జీవన్, లవన్, గంగా ప్రసాద్, శంకర్, సాయినాథ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.