కుష్మాండ అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు
మనోరంజని ప్రతినిధి బాసర సెప్టెంబర్ 25
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కుష్మాండా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హారతి విశేష పూజల అనంతరం అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర- కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా వస్తున్నారు. అమ్మవారి క్షేత్రంలో ప్రవహించే పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు