డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన ముధోల్ ఉత్సవ కమిటి
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం లో ముధోల్ హిందూ ఉత్సవ కమిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య ఆదేశానుసారం సిబ్బంది కలిసి దాదాపు 30 మొక్కలు నాటడం జరిగింది. ఉత్సవ కమిటి అధ్యక్షులు రోళ్ళ రమేశ్ మాట్లాడుతూ మొక్కలు మానవాళికి జీవనాధారం అయిన ఆక్సిజన్ ను అందించడం తో పాటు కళాశాలకు వచ్చిన వారికి చల్లని నీడను అందిస్తాయని అన్నారు. ప్రతీ ఒక్కరు ఒక మొక్కను తమ వంతుగా తమ తమ ఇంటి ముందర నాటాలని సూచించారు. వృక్షో రక్షతి – రక్షితః అన్న పదాన్ని నిజం చేయాలని, నాటిన మొక్కలను నీరు అందిస్తు కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఉత్సవ కమిటి గౌరవ అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, ఉపాధ్యక్షులు తాటివార్ రమేష్, వరగంటి జీవన్, కళాశాల లెక్చరర్లు సంజీవ్ కుమార్, సత్యనారాయణ, అంబదాస్, ప్రవీణ్ లాల్, రాజకుమార్, రాజు, శివాణి, వనజ, గ్రామ పంచాయతీ సిబ్బంది లక్ష్మణ్ ( సుబ్బు ), రతన్, ఆకాశ్, విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు.