అమ్మవారి ఆలయానికి సన్నాయి-డోలును అందజేత
బాసర మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 23
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన భక్తులు జె. జగదీష్, బి. ప్రసాద్ కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయానికి అవసరమైన మంగళ వాయిద్యాలైన ఒక డోలు, రెండు సన్నాయిలను ఉచితంగా అందజేశారు. వీటి విలువ రూ. 44,200 ఉంటుందని ఆలయ అనువంశిక ట్రస్ట్ ఛైర్మన్ శరత్ పాఠక్ తెలిపారు. వాయిద్యాలు బహుకరించిన భక్తులకు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. వీరి వెంట ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, ఆలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.