11 నుంచి పాఠశాలలు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు

సంక్రాంతి సెలవులు 2025, తెలంగాణ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు
  1. సంక్రాంతి సెలవులు ప్రారంభం: జనవరి 11 నుంచి పాఠశాలలు, కాలేజీలకు సెలవులు.
  2. సెవలల కాలపరిమితి: పాఠశాలలకు 7 రోజులు, కాలేజీలకు 6 రోజులు సెలవులు.
  3. తిరిగి తరగతులు ప్రారంభం: పాఠశాలలు జనవరి 18న, కాలేజీలు జనవరి 17న ప్రారంభమవుతాయి.

 

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పాఠశాలలు జనవరి 11 నుంచి 17 వరకు ఏడురోజులపాటు సెలవులు ఉంటాయి. జూనియర్‌ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు ఆరురోజులపాటు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు జనవరి 18న, కాలేజీలు జనవరి 17న తిరిగి ప్రారంభమవుతాయి.


 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, మరియు ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి పండుగకు సంబంధించిన సెలవులు అధికారికంగా ప్రకటించారు. విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఈనెల 13 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినా, ఈనెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులుగా ప్రకటించారు.

సెలవుల తేదీలు:

  • పాఠశాలలు: జనవరి 11 నుంచి 17 వరకు (7 రోజులు).
  • జూనియర్ కాలేజీలు: జనవరి 11 నుంచి 16 వరకు (6 రోజులు).

తిరిగి తరగతుల ప్రారంభం:

  • పాఠశాలలు: జనవరి 18న తిరిగి ప్రారంభమవుతాయి.
  • జూనియర్ కాలేజీలు: జనవరి 17న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు వీటిని ఆస్వాదించి, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడపవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment