గ్రామాలలో పారిశుధ్య పనులను నిరంతరం కొనసాగించాలి.

గ్రామాలలో పారిశుధ్య పనులను నిరంతరం కొనసాగించాలి.

గ్రామాలలో పారిశుధ్య పనులను నిరంతరం కొనసాగించాలి.

ఎంపీవో శ్రీ పతి బాపు రావు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

గ్రామాలలో పారిశుధ్య పనులను నిరంతరం కొనసాగించాలి.

జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు జైపూర్ మండలంలోని టేకుమట్ల, ఎల్కంటి గ్రామ పంచాయతీలని యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా సందర్శించి ఈ క్రింది సూచనలు చేయడం జరిగింది.
గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఇంటింటి తిరిగి చెత్త సేకరించే సమయంలో గ్రామ పంచాయతీ ట్రాక్టరుకు గన్ని సంచులను వేర్వేరు గా అమర్చి తడి చెత్త, పొడి చెత్త,వేర్వేరుగా సేకరించాలని, కంపోస్టు షెడ్ నందు వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని సూచించారు.
ఇంటి పన్ను వసూలును వేగవంతం చేసి ఈనెల 15 వరకు అన్ని గ్రామ పంచాయతీలలో 100 శాతం పూర్తి చేయాలని సూచించారు.
అన్ని రకాల రిజిష్టర్లు మెయింటెన్ చేయాలని, వాటిని అప్డేట్ చేసి ఉంచాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న ట్రేడ్ లైసెన్స్ వెంటనే రెన్యువల్ చేయించాలని మరొకసారి సూచించారు.
పెండింగ్ లో ఉన్న ఆర్ టి ఐ దరఖాస్తులకు వెంటనే రిప్లై సమర్పించి పెండింగ్ లేకుండా చూసుకోవాలి సూచించారు.
అన్ని గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న ఫైనాన్షియల్ మరియు నాన్ ఫైనాన్సియల్ ఆడిట్ పేరాలను డ్రాప్ చేయించుకోవాలని సూచించారు.
పంచాయతి కార్యదర్శులు ప్రతీ రోజు ఉదయం విధులకు హాజరై 9:00 లోపు పీ ఎస్ యాప్ నందు అటెండెన్స్ మరియు డి ఎస్ ఆర్ నమోదు చేయాలని సూచించారు.. గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు వెంటనే ఇన్సూరెన్స్ పాలసీ చేయించి అట్టి సమాచారమును తెలియజేయాలని సూచించారు.

ఈ పర్యటనలో ఎంపీ ఓ వెంట పంచాయతీ కార్యదర్శులు ఆర్ శ్రావణి,శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment