దోమల నియంత్రణకు శానిటేషన్ చర్యలు – జవాన్ రాజు, టీమ్ కు కృతజ్ఞతలు
ఇందూరు, జూలై 16
ఇందూరులో ఇటీవల పెరుగుతున్న దోమల బెడద నేపథ్యంలో, జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) ఇందూరు జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర విన్నపంపై స్పందించిన నగరపాలక సంస్థ 50వ డివిజన్ జవాన్ రాజు సత్వరమే శానిటేషన్ పనులను చేపట్టి ముగించారు.
ఈ సందర్భంగా మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా వెంటనే స్పందించి శుభ్రత పనులు నిర్వహించిన జవాన్ రాజు మరియు ఆయన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో NHRC ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యదర్శి చండాలియా నరేందర్, నగర అధ్యక్షురాలు పి. జ్యోతి, జిల్లా కార్యదర్శి జె. లక్ష్మణ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
చివరిగా మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ, “ఇలాంటి సమస్యలు ఎదురైతే ప్రజలు వెంటనే అధికారులను సంప్రదించాలి. శానిటేషన్ బృందం స్పందించేందుకు సిద్ధంగా ఉంటుంది” అని అన్నారు.