నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు — సీఎం, పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు

నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు — సీఎం, పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు
కమ్మర్పల్లి మండలంలో పాలాభిషేకం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గార్లకు కృతజ్ఞతాభివందనాలు

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 17

నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు — సీఎం, పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు ఆనందంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ, ఇంతకు ముందు ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి చొరవతో వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం జిల్లా ప్రజలకు ఒక గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కేబినెట్‌ మంత్రివర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పడిగెల ప్రవీణ్, సల్లూరి గణేష్, గుడిసె అంజమ్మ, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, గోపిడి లింగారెడ్డి, నరేందర్, శైలేందర్, సింగిరెడ్డి శేఖర్, కొమ్ముల రవీందర్, నాగరాజు, పూజారి శేఖర్, సింగిరెడ్డి ప్రతాప్, ఆల్గోట్ రంజిత్, వేములవాడ జగదీష్, దులూర్ కిషన్, సుంకరి గంగాధర్, కంపదండి అశోక్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment