- గజానన్ ప్రైవేట్ హాస్పిటల్ పై ఫిర్యాదు
- వైద్యం పేరుతో బాధితుల నుండి అన్యాయంగా డబ్బు వసూలు
- ఆదాయ పన్ను శాఖకు వివరాలు సమర్పించిన సామ రూపేష్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గజానన్ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుడు, రోగుల నుండి అన్యాయంగా వేలు వేల రూపాయలు తీసుకుంటున్నారని యువజన కాంగ్రెస్ నేత సామ రూపేష్ రెడ్డి ఆదాయ పన్ను శాఖ అధికారిని కలసి ఫిర్యాదు చేశారు. అతని దోపిడీపై విచారణ చేపట్టి, సరైన పన్ను చెల్లింపు జరుగుతోందో లేదో విచారణ కోరారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై గజానన్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాని, డాక్టర్ అభిజిత్, తన ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి అన్యాయంగా వైద్యం పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సామ రూపేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వైద్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల నుండి ఖాతా లేకుండా, బిల్లులేని సేవలను అందిస్తూ, అహంకారంగా ఫీజులు పెంచడం తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తోంది. సామ రూపేష్ రెడ్డి, ఈయన ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారికి విచారణ చేపట్టి, పన్ను చెల్లింపు పద్ధతులు కూడా పరిశీలించాలని కోరారు.