దేశాయ్ బీడీ కంపెనీలో కిరాణా సామాన్లు విక్రయాలు..!
– కిరాణా సామాన్లు తీసుకుంటేనే బీడీలు తంబాకు వేస్తాం.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వైనం
– కార్మికులకు బలవంతంగా కిరాణా సామాన్లను కట్టబెడుతున్న యాజమాన్యాలు
– నెలకు రూ.300 నుండి రూ.800 కార్మికుల నుండి వసూలు చేస్తున్న కమిషన్ ఏజెంట్లు
– మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
– తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న బీడీ కార్మికులు
– కార్మికుల కడుపును రూ. కోట్లల్లో కొడుతున్న యాజమాన్యం
మనోరంజని బ్యూరో ఆగస్టు 05
బైంసా: రెక్కాడితే కానీ డొక్కాడని.. కుటుంబాలు అవి.. రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చే రూపాయలలో దాంట్లో నుంచి బలవంతంగా లాక్కోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ కుటుంబాలు నలిగిపోతున్నాయి అసలే బీదవారు మేము చెప్పిందే వేదం చేసేదే న్యాయం అన్నట్టుగా ఓ సంస్థ వ్యవహరిస్తోంది. తమ కింద పనిచేస్తున్నారు. మనం చెప్పిందే వినాలి.. చేసిందే చూడాలి.. లేదంటే మేమేంటో చూపిస్తాం అంటూ గర్వం చూపిస్తూ కిందిస్థాయి వాళ్లను నల్లిని నలిపినట్టు నలుపుతున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఇంత ఆధునిక కాలంలో ఇంత జరుగుతోందా..? ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం ఏం చేస్తోంది..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీలో మెదులుతున్నాయా..? అవును ఇది అంతా నిజమే ఆధునిక కాలంలో కూడా కార్మికులను అనగా తొక్కుతున్నారు. ఇది మన నిర్మల్ జిల్లాలో యదేచ్చగా జరుగుతున్న ప్రశ్నించే నాధుడే లేకపోవడంతో వాళ్ళ ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయని విమర్శలున్నాయి.. ఇంతకు అది ఏమి..? అదేనండి బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్లకు ఏం సమస్యలు ఉంటాయి అనుకుంటున్నారా..? వాళ్లకు ఉన్నంత సమస్యలు మరి ఎవరికి లేవు రోజంతా కష్టపడి 1000 బీడీలు చుడితే రూ. 262 వస్తున్నాయి కదా అనుకుంటే పొరపాటే కొన్ని కంపెనీలలో ఇలా ఉండదు. ఎందుకు నిదర్శనం” దేశాయ్ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ” ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటుంది. కార్మికులకు ఇచ్చే రూ.262 కూలీ నుండి రూ.10 తక్కువగా ఇస్తోంది. దీనికి తోడు కంపెనీకి సంబంధించిన కొన్ని కిరాణా వస్తువులు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం కుదరదు. అవి తీసుకుంటేనే తంబాకు వేస్తాం.. బీడీలు తీసుకుంటాం.. లేదంటే మీ ఇష్టం అంటూ వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.. ఇంతటితో ఆగకుండా ఆకు క్వాలిటీ ఇవ్వకుండా ఇచ్చేది ఒకటి.. తీసుకునేటి ఇది మరొక రకం… రోజు చటన్ పేరుతో బీడీలను తెంపడం కార్మికులకు నష్టాలు తేవడం జరుగుతుంది. అసలే పులి తక్కువ.. అందులో కిరాణా సామాన్… ఇలా చేస్తూ కార్మికుల పొట్టలను కొడుతోంది. ఈ తంతు సంవత్సరాలనుండి జరుగుతూ వస్తుంది. అధికారులకు ఈ విషయం తెలిసిన ఏమాత్రం ఆ వైపు కన్నెత్తి చూడరు. ఫస్ట్ వచ్చిందా.. ఆఫీస్ కి వెళ్లడం వాళ్లు ఇచ్చింది పుచ్చుకోవడం సైలెంట్ గా రావడం జరుగుతోంది. కార్మికులు ఏమైతే తమకేంది మాకు ప్రతి నెల ఫస్ట్ కు మామూలు వస్తున్నాయి ఎవరు ఏమైపోతే తమకేంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.. ఇది వందలలో అనుకుంటే పొరపాటే..? ఈ బిజినెస్ వందల కోట్లలో కొనసాగుతోంది..? ఇంత జరుగుతున్న ఏ ఒక్క అధికారి స్పందించారు. ఏ ఒక్క ప్రజా ప్రతినిధి స్పందించరు. ఎవరైనా ప్రశ్నిస్తే మేం కంపెనీ 30 రోజులు నడిపిస్తున్నామని.. కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నామని.. మీరు ఇలా కంప్లీట్ లు చేస్తే మా కంపెనీ మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మిగతా కంపెనీల లాగా తొమ్మిది రోజులు పది రోజులు మేము నడిపించడం లేదని 30 రోజులు నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ నే కార్మికుల పొట్టలు కొడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కార్మికులకు పని కల్పిస్తున్నామని చెప్పి శ్రమ దోపిడీకి పాల్పడుతున్న దేశ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నా అభిప్రాయం.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంబంధిత దేశాయ్ కంపెనీ పై పూర్తి విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు, కార్మికులు, తదితరులు డిమాండ్ చేస్తున్నారు
దేశాయ్ బీడీ కంపెనీలో కిరాణా సామాన్లు విక్రయాలు..!
Published On: August 5, 2025 9:14 pm