తాండ్ర గ్రామం నుండి ఎంపిటిసి బరిలో సాక్ పల్లి సురేందర్

తాండ్ర గ్రామం నుండి ఎంపిటిసి బరిలో సాక్ పల్లి సురేందర్

తాండ్ర గ్రామం నుండి ఎంపిటిసి బరిలో సాక్ పల్లి సురేందర్

M4News ప్రతినిధి – సారంగాపూర్, అక్టోబర్ 9

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని తాండ్ర.జి గ్రామానికి చెందిన సాక్ పల్లి సురేందర్, ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపిటిసి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థానాన్ని బీసీ మహిళా కోటాకు కేటాయించిన నేపథ్యంలో, స్థానికంగా రాజకీయ అవగాహన కలిగిన నాయకుడిగా పేరుగాంచిన సురేందర్ పోటీపై గ్రామంలో చర్చలు ప్రారంభమయ్యాయి.

సాక్ పల్లి సురేందర్ ప్రస్తుతం సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుడిగా, పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజలకు చేరువైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని సురేందర్ తెలిపారు. గ్రామ ప్రజల మద్దతుతో విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల ఆశీర్వాదంతో సేవా రాజకీయాలు కొనసాగించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

 
 
 
 

 

Join WhatsApp

Join Now

Leave a Comment