ఆర్టీసీ డ్రైవర్ కూతురు ఎల్ఎల్ఎంకు ఎంపిక
తానూర్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 13
తానూరు మండలంలోని ఝరి (బి) గ్రామానికి చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ తమ్మల మాధవరావు కూతురు తమ్మల అఖిలభారతీ ఎల్ఎల్ఎం కోర్సుకు ఎంపిక అయింది. గ్రామీణ స్థాయి నుండి వచ్చిన అఖిలభారతి ఎల్ఎల్ఎంలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు, నాయక్ పోడ్ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎల్ఎల్ఎమ్ లో సీటు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరంగా కష్టపడాలన్నారు. ఉన్నత విద్యకు ఎంపికైన ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.