అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 95 వేలు ఆదాయం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 01 – నిర్మల్ జిల్లా,సారంగాపూర్:మండలంలోప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.36 లక్షల 95 వేల ఆదాయం తోపాటు, మిశ్రమ బంగారం 190 గ్రాములు, వెండి 3 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు
ఆలయ ఛైర్మెన్ సింగం భోజగౌడ్,ఈవో రమేష్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపుకు దేవాదాయశాఖ అధికారి భూమయ్య పర్యవేక్షకులుగా ఉన్నారు.స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలిసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మ కర్థలు ఆలయసిబ్బంది,ఆయగ్రామాల భక్తులు సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు