రూ.334 కోట్ల అవినీతి.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష!
చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అవినీతి చర్యల్లో భాగంగా మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు మరణశిక్ష విధించింది. రూ.334 కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన పై ఈ మేరకు చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం విధిస్తూ.. జిలిన్ ప్రావిన్స్‌లోని కోర్టు తీర్పు చెప్పింది. ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని, లంచం సొత్తునూ స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది.