ఆర్ఎంపీలను విస్మరించడం తగదు తక్షణమే శిక్షణను ప్రారంభించాలి

ఆర్ఎంపీలను విస్మరించడం తగదు

తక్షణమే శిక్షణను ప్రారంభించాలి

ఎం 4 ప్రతినిధి ముధోల్

గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు తక్కువ ధరకే ప్రథమ చికిత్సను అందిస్తున్న ఆర్ఎంపీలను విస్మరించడం తగదని ఆర్ఎంపి అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆశమొల్ల మోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపి-పిఎంపీలకు సత్వరమే శిక్షణ తరగతులను ప్రారంభించాలని కోరారు. ఇటీవలే ఆర్ఎంపి-పిఎంపి ల ప్రథమ చికిత్సలయాలపై తరచూ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సను అందించి ప్రాణాలను కాపాడడంలో గ్రామీణ వైద్యుల పాత్ర మరువరాదని అన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులను ప్రారంభించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు సైతం ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే ప్రథమ చికిత్సను అందించాలని
సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటే అసోసియేషన్ బాధ్యత తీసుకోదని స్పష్టం చేశారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment