ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 25
హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని, పేదల ఉసురు కాంగ్రెస్ సర్కార్ కు తగులుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బిజెపి ఆధ్వర్యంలో హైదరాబాదులో మూసి బాధితులకు న్యాయం చేయాలని నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. బి జె ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తో కలిసి తాను లంగర్ హౌస్ వెళ్లాలని బాధితుల కష్టాలు చూస్తే కంట నీరు వచ్చిందన్నారు. మూసి బాధితులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో కాల యాపన చేస్తున్నారన్నారు.. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. మూసి పరివాహక ప్రాంతం లో పండుగలు చేసుకునే స్థితిలో పేదలు లేరన్నారు.మూసి ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని అన్నారు. ఆడపడుచులకు, బాధితులకు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు