రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చాలి – వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం డిమాండ్

రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చాలి – వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం డిమాండ్

రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చాలి – వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం డిమాండ్

చలో హైదరాబాద్ మహాగర్జనకు పిలుపు | బోధన్ మండలంలో ప్రచారం జోరుగా సాగింది

బోధన్, నిజామాబాద్ జిల్లా:

రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చాలి – వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం డిమాండ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం డిమాండ్ చేశారు. బోధన్ మండలంలోని రాకాసిపేట్, బండారుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.

చేయూత పెన్షన్లను రూ.4000 కు పెంచాలి, కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వికలాంగులకు రూ.6000, కండరాల క్షీణత బాధితులకు రూ.15,000 చెల్లించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.

చలో హైదరాబాద్ మహాగర్జన – ఆగస్టు 13న ఎల్బీ స్టేడియం

సుజాత సూర్యవంశం మాట్లాడుతూ, “పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు 13న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పింఛనుదారుల ‘మహాగర్జన’ సభ జరుగనుంది. ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవ్వాలని కోరుతున్నాం. ఇది హక్కుల కోసం ప్రజా ఉద్యమం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసీంగారి భూమయ్య మాదిగ, దగుల ప్రకాష్ రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment