బాసరలో శిశు మందిర్ పాఠశాల పునఃప్రారంభం
మనోరంజని ప్రతినిధి
బాసర : ఫిబ్రవరి 07
గతంలో చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ కొలువైన బాసరలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నడుపబడి కొన్ని కారణాల వల్ల 10 సంవత్సరాల క్రితం మూతపడింది. సంస్కారయుతమైన విద్యను అందించే శిశు మందిర్ మూతపడం బాసర గ్రామ ప్రజలకు వెలితి అనిపించింది. ఎలాగైనా సరే శ్రీ సరస్వతీ శిశు మందిర్ ను తిరిగి పునఃప్రారంభించాలనుకున్న హితైషులు, పూర్వ విద్యార్ధులు, పూర్వ పోషకులు అందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారి నిర్ణయాన్ని శ్రీ సరస్వతీ విద్యాపీఠం పెద్దలకు తెలియజేశారు.
దీంతో శ్రీ సరస్వతీ విద్యాపీఠం పెద్దలు గ్రామ పెద్దలతో కలిసి కొండూర్ ప్రతాప్ రావ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు వేకువ జామున ఉ.2:45 ని.లకు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఉ.10:00 గం.లకు పాఠశాల పునఃప్రారంభ సభను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్, సిబిఆర్ ప్రసాద్, పరమానంద బన్సల్ పాల్గొని మార్గదర్శనం చేశారు. వీరితో పాటు క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్య నారాయణ, విభాగ్, జిల్లా అధికారులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ ముధోల్ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. పాఠశాల పునఃప్రారంభం కావడం పట్ల అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు