స్వంత ఖర్చులతో వ్యవసాయ రహదారికి మరమ్మతులు
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని ధర్మబాద్ రోడ్డు నుండి ఎల్వాత్ రహదారికి అనుకొని ఉన్న బడపహాడ్ దర్గాకు వ్యవసాయదారులు వెళ్లే దారి వర్షానికి తెగిపోయింది. గత 15 సంవత్సరాల క్రితం గ్రావెల్ వేస్తామని భూమి పూజ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు మోరము కానీ అక్కడ కల్వర్టు నిర్మించడం జరగలేదు. వ్యవసాయదారులకు చేన్లోకి వెళ్దామంటే ట్రాక్టర్లు కూడా వెళ్లలేని పరిస్థితిలో రోడ్డు అధ్వానంగా మారింది. దాన్ని వెంటనే గడ్డం సుభాష్ తన స్వంత ఖర్చులతో జేసీబీ ద్వారా మరమ్మతులు చేయించడం జరిగింది. ఆ రోడ్డు గుండ ట్రాక్టర్లు వెళ్లడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.