అమరావతి : అక్టోబర్ 19
ఏపీలో ఇంటర్ విద్యా అభ్యసిస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ ఈ రోజున విడుదల చేసింది.
2025 మార్చిలో జరగబోయే ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.
ఆలస్య రుసుం రూపంలో రూ. 1000 చెల్లించి నవంబర్ 20 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. ఇకపై గడువు అవకాశం ఉండదని అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు సూచించారు.
ప్రైవేట్‌గా పరీక్షలు రాయదలిచిన విద్యార్థుల కోసం అటెండెన్స్ మినహాయిస్తూ, వచ్చే నెల 15 వరకు రూ. 1500, నవంబర్ 30 వరకు పెనాల్టీతో రూ. 500 ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు.