జర్నలిస్టులకు డబ్ల్యూజేఐ అవార్డులు * దరఖాస్తుల ఆహ్వానం * బ్రోచర్ విడుదల

జర్నలిస్టులకు డబ్ల్యూజేఐ అవార్డులు
* దరఖాస్తుల ఆహ్వానం
* బ్రోచర్ విడుదల

మనోరంజని ( ప్రతినిధి )

హైదరాబాద్: డిసెంబర్ 23

సమాజ హితం కోసం నిరంతరం పనిచేసే పాత్రికేయ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారికి అవార్డులు ఇవ్వనున్నట్లు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లోని జర్నలిస్టుల కాలనీలో సోమవారం 2024 అవార్డుల బ్రోచర్ ను రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎన్ కృపాకర్, రాష్ట్ర అధ్యక్షులు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యదర్శి క్రాంతి లు విడుదల చేశారు. మూడు కేటగిరీలలో జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు డిజిటల్ మీడియాకు ఈ ఏడాది నుంచి అవార్డులు ఇస్తున్నట్లు వారు చెప్పారు. ప్రతి విభాగం నుంచి ప్రతిభావంతులను ఎంపికచేసి ఈ అవార్డులను బహూకరించనున్నారు. సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ విజేతలను ఎంపిక చేయనుంది. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ఆసక్తిగల వారు జనవరి 10వ తేదీలోగా ఎంట్రీలు telangana2017@gmail.comకు
పంపించాలని కోరారు. జనవరి మూడోవారంలో హైదరాబాద్ లో పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
….
హైదరాబాద్ కమిటీ ప్రకటన

జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కమిటీని ప్రకటించింది. అధ్యక్షులుగా బాలక్రిష్ణ, ఉపాధ్యక్షులుగా కోటిరెడ్డి, నవత, కార్యదర్శిగా పవన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా శ్రీ హర్ష కోశాధికారిగా సావర్కర్ లను ప్రకటించారు. రాబోయే రోజులు సభ్యత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. . జాతీయ భావజాల వ్యాప్తికి, పాత్రికేయులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అందరూ కలిసి పని చేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment