పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోండి
ముధోల్ తహసిల్దార్ శ్రీకాంత్
ఎమ్4 ప్రతినిధి ముధోల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని ముధోల్ తహసిల్దార్ శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జాబితాలో పేర్లు ఉన్న పట్టభద్రులు మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా ఓటు హక్కు సైతం పొందడానికి పట్టభద్రులు విధిగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను తహసిల్ కార్యాలయంలో అందించాలన్నారు. దరఖాస్తులను పూర్తి చేయడంలో సమస్యలు తలెత్తితే నివృత్తి చేయడానికి తమ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.