నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు

తెలంగాణ డీఎస్సీ 2024 నియామక పత్రాల పంపిణీ
  • తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్త ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత
  • సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నియామక పత్రాల పంపిణీ
  • 11,062 టీచర్ పోస్టులకు 10,006 నియామకాలు పూర్తయ్యాయి

తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. మొత్తం 11,062 పోస్టుల్లో 10,006 పోస్టులకుగాను అభ్యర్థులు ఎంపికవ్వగా, మిగిలిన పోస్టులు న్యాయ పరమైన కారణాల వల్ల ఇంకా ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎదురు చూస్తున్న అభ్యర్థుల కల ఈరోజు సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం 2024 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు అందించనుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జరగనుంది, దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మొత్తం 11,062 పోస్టులకుగాను 10,006 పోస్టులకు అభ్యర్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రత్యేక ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు ఇంకా న్యాయ కారణాల వల్ల ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో DSC నోటిఫికేషన్ విడుదల కాగా, పరీక్షలు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment