: దేశంలో పవన ఇంధన శక్తి వెనుకబడి ఉండటానికి గల కారణాలు

Wind Energy Development in India
  • పవన శక్తి ఉత్పత్తి, వినియోగం వెనుకబడి ఉండటానికి కారణాలు.
  • సౌర శక్తితో పోల్చితే పవన శక్తి ఎంత వెనుకబడి ఉంది?
  • ప్రభుత్వ చర్యలు: 2030 నాటికి 500 GW నాన్-ఫాసిల్ ఎనర్జీ లక్ష్యం.
  • కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయ సమస్యలు.
  • MP రామసహాయం రఘురాం రెడ్డి ప్రశ్న.

: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, లోక్ సభలో దేశంలో పవన ఇంధన శక్తి వెనుకబడి ఉండటానికి గల కారణాలను ప్రశ్నించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యలు, 2030 నాటికి 500 GW లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రణాళికలు, యూరోపియన్ యూనియన్ సహకారం పై సమాధానం ఇచ్చారు.

పవన ఇంధన శక్తి వినియోగం దేశంలో సౌరశక్తితో పోల్చుకుంటే చాలావరకు వెనుకబడి ఉంది. ఈ దుస్థితికి కారణాలు ఏమిటి అన్నది ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, లోక్ సభలో అడిగారు. ఆయన ప్రశ్నించిన అంశం, పవన శక్తి ఉత్పత్తి, వినియోగం పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అన్నది.

ఈ ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర విద్యుత్, కొత్త పునరుత్పాదక ఇంధన శాఖల సహాయ మంత్రి శ్రీ పాద్ యశో నాయక్, ప్రభుత్వం 2030 నాటికి 500 GW నాన్-ఫాసిల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడానికి పవన మరియు సౌర శక్తితో సహా అన్ని పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 2022లో, టారిఫ్ నిర్ణయాలకు సంబంధించిన ఫీడ్-ఇన్ టారిఫ్ మరియు ఇ-రివర్స్ వేలం పద్ధతులపై నివేదిక సమర్పించామని, గుజరాత్, తమిళనాడు తీరంలో ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్టులపై అధ్యయనం చేసినట్లు వివరించారు.

ప్రభుత్వ చర్యలు, ముఖ్యంగా కొత్త ప్రణాళికలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంపొందించేందుకు ఉద్దేశించబడ్డాయి. 2018లో యూరోపియన్ యూనియన్ సహకారంతో, ఈ ప్రాజెక్టుల పట్ల పరిశీలన ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment