మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,040 పెరిగి రూ.1,02,330కు చేరింది. 7 రోజుల్లోనే రూ.3,050 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.93,800 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,29,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి