గుడి గుడికో జమ్మి చెట్టు – గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాథోడ్ అశోక్

గుడి గుడికో జమ్మి చెట్టు - గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాథోడ్ అశోక్

గుడి గుడికో జమ్మి చెట్టు – గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాథోడ్ అశోక్

మనోరంజని ప్రతినిధి, సారంగాపూర్ | సెప్టెంబర్ 26

ఊరి ఉరికో జమ్మి చెట్టు, గుడికో జమ్మి చెట్టు నాటాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ అశోక్ పిలుపునిచ్చారు.

శుక్రవారం సారంగాపూర్ మండలం అడెల్లి ఆలయం ఆవరణలో ఆలయ చైర్మన్ భోజనం తో కలిసి ఆయన జమ్మి చెట్టు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఈ మొక్కలు నాటుతున్నాం. భావితరాలకు జమ్మి చెట్టు ప్రాముఖ్యత తెలిసేలా ప్రతి గ్రామంలో వీటిని నాటుతున్నాం” అని పేర్కొన్నారు.

తరువాత ఆలయ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో నారాయణ గౌడ్, సతీష్ గౌడ్, సుశాంత్, రాజేశ్వర్, మాజీ సర్పంచ్ రాజన్న తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment