రాఖీ కౌంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి.
-డిపో మేనేజర్ పండరీ.
నిర్మల్ జిల్లా : సోదరీమణులు రాఖీ కౌంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ పందరీ అన్నారు.మంగళవారం నిర్మల్ బస్టాండ్ లో రాఖీ కౌంటర్ ను ప్రారంభించి మాట్లాడారు..
దూర ప్రాంతాలకు సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లలేని సోదరీమణుల కొరకు నిర్మల్ బస్టాండ్ లో ఆర్టీసీ ప్రత్యేక రాఖీ కౌంటర్ ను ఏర్పాటు చేసింది.కార్గో ద్వారా రాఖీ లు పంపడానికి ఈ సౌకర్యం కలిపిస్తున్నట్లు వెల్లడించారు.సోదరి మణులు ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి బుక్ చేసినచో మీ రాఖీ లు వేగంగా భద్రంగా సురక్షితంగా మీ సోదరులకు చెర వేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కిషోర్, స్టేషన్ మేనేజర్ ఏ.ఆర్.రెడ్డి, కంట్రోలర్లు పి.ఆర్.గోపాల్, గజపతి లు పాల్గొన్నారు.
రాఖీ కౌంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి.
Published On: August 5, 2025 10:03 pm