రేవంత్ రూపంలో ఉన్న వినాయక విగ్రహాన్ని తొలగించాలని రాజాసింగ్ డిమాండ్

రేవంత్ రూపంలో ఉన్న వినాయక విగ్రహాన్ని తొలగించాలని రాజాసింగ్ డిమాండ్

రేవంత్ రూపంలో ఉన్న వినాయక విగ్రహాన్ని తొలగించాలని రాజాసింగ్ డిమాండ్

హైదరాబాద్ అఘాపురాలో సీఎం రేవంత్ రూపంలో గణేశ్ విగ్రహం

రేవంత్ రెడ్డి దేవుడు కాదన్న రాజాసింగ్

హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్య

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన ఓ గణనాథుడి విగ్రహం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో నెలకొల్పిన ఈ విగ్రహంపై స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హిందూ మనోభావాలను కించపరచడమేనని ఆరోపిస్తూ, విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే, వినాయక చవితి వేడుకల సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలోని అఘాపురాలో తెలంగాణ ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డిని పోలినట్లుగా రూపొందించారు. ఈ విషయం తెలుసుకున్న రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు.

“సీఎం రేవంత్ రెడ్డి దేవుడు కాదు, ఆయన రూపంలో విగ్రహం పెట్టడం సరికాదు” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ విగ్రహాన్ని, మండపాన్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రిపై గౌరవంతోనే విగ్రహం పెట్టి ఉండవచ్చని, కానీ ఇలాంటి చర్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. మత విశ్వాసాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన సూచించారు

Join WhatsApp

Join Now

Leave a Comment