ముద్గల్ పాఠశాలలో చేరిన వర్షపు నీళ్ళు

ముద్గల్ పాఠశాలలో చేరిన వర్షపు నీళ్ళు

*ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 27*

భారీ వర్షాల కారణంగా ముధోల్ మండలం ముద్గల్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షం నీళ్లు చేరిపోయాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాల ప్రాంగణం నీటితో నిండిపోవడంతో తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. నీటిని తొలగించి, భవిష్యత్తులో పాఠశాల ఆవరణలో వర్షపు నీళ్ళు నిలవకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పోషకులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment