అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం…

అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం...

అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి .

మరో మూడు రోజులు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిక

ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా అదికారులు సహయ చర్యలు చేపట్టాలి.

షాద్‌నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే వర్షాలు మోస్తరు నుంచి భారీ స్థాయికి పెరిగాయి. ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో చిక్కుకుపోయారు. ఇక పలు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో నీరు నిలిచి సీజనల్ వ్యాధుల శృతి పెరగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.వర్షాకాలం అంటేనే అంటువ్యాధుల ముప్పు మొదలయ్యే కాలం. వర్షాల తీవ్రతతో వీటి వ్యాప్తి వేగంగా జరుగుతుందనే ఆందోళన వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వరాల లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వానికి సవాల్‌… సమన్వయంతో పని చేయాలి.

విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి పంచాయతీలో కార్యదర్శులతో పాటు పారిశుధ్య సిబ్బంది విధులు చక్కగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.ప్రధానంగా తీసుకోవాల్సిన చర్యలు…పరిసరాల శుభ్రత ప్రతి రోజూ నిర్వహించాలి.తాగునీటి బావుల్లో క్లోరినేషన్, కాలువల శుభ్రత నిరంతరం కొనసాగించాలి.డెంగీ, మలేరియా నివారణకు ఇంట్లో ఖాళీ డబ్బాలు, డ్రమ్ములు, కూలర్లలో నీరు నిలవకుండా చూడాలి.ఫాగింగ్ నిర్వహణ, చెత్తను డంప్ యార్డుకు తరలింపు వంటి చర్యలు పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టాలి.వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల లక్షణాలపై అవగాహన కల్పించాలి.పురాతన భవనాలు ఖాళీ చేయాలి.శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివాసం ఉంటే ప్రాణ హాని జరగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఇళ్లలో నివసిస్తున్న వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లయితే స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి.

రైతులకు ముందస్తు సూచనలు

పంటలను రక్షించుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కొన్ని సూచనలు ఇచ్చారు.పొలాల్లో నీరు నిలిచకుండా నికాసీ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి.నీటి నిల్వల వల్ల నష్టం కలగకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.ఏఈవోలు, రైతు బంధు సమితి సభ్యులు రైతులకు సూచనలు ఇవ్వాలి.ఎరువులు, తడి నుండి రక్షించాలి.వాతావరణ శాఖ ప్రకారం మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే ఇతర ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు కోరుతున్నారు.ప్రవహిస్తున్న చెరువులు కుంటల వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగం హెల్ప్‌లైన్ నెంబర్లు, రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, గ్రామ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ప్రజల కోరుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment