✒దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రాబోయే రోజుల్లో రైల్వేలో అనేక ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
ముఖ్యంగా సెక్షన్ కంట్రోలర్ పోస్టులు కోసం ప్రత్యేక నోటిఫికేషన్ (CEN No.04/2025) తీసుకురానున్నట్లు సమాచారం.
నోటిఫికేషన్ వివరాలు..
ఖాళీల సంఖ్య..
మొత్తం 368 పోస్టులు దేశవ్యాప్తంగా భర్తీ కానున్నాయి. అన్ని రైల్వే జోన్‌లలోనూ ఈ ఖాళీలు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు వివరాలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 15, 2025
చివరి తేదీ: అక్టోబర్ 14, 2025
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు & వయస్సు..
వయస్సు పరిమితి: 20 నుంచి 33 సంవత్సరాల మధ్య.
రిజర్వేషన్ వర్గాలకు వయస్సు సడలింపు:
OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
దివ్యాంగ అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
విద్యార్హత..
పోస్టు ప్రకారం విద్యార్హతలు భిన్నంగా ఉంటాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి.
జీతం & సౌకర్యాలు..
ఎంపికైన వారికి నెలకు రూ.35,400 వరకు ప్రాథమిక జీతం లభిస్తుంది.
అదనంగా, డిఏ, హెచ్ఆరేఏ, ట్రావెల్ అలవెన్సులు వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.
రైల్వే ఉద్యోగులకు ఉచిత లేదా తక్కువ ధరలో ప్రయాణ సదుపాయం, మెడికల్ ఫెసిలిటీలు కూడా లభిస్తాయి.
నియామక ప్రక్రియ..
ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది.
CBTలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఫైనల్‌గా అన్ని అర్హతలు పూర్తి చేసిన వారిని నియామకం చేస్తారు.
పోస్టులు లభించే జోన్లు..
అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్‌పూర్, తిరువనంతపురం రీజియన్లలో పోస్టులు భర్తీ చేయబడతాయి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రాథమిక వివరాలు మాత్రమే లభిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అప్పుడు పోస్టుల సంఖ్య, అర్హతలు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు క్లియర్‌గా తెలుస్తాయి