రాహుల్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్
తానూర్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 12
తానూర్ మండలం వడగాం గ్రామానికి చెందిన మద్నూరే రాహుల్‌కు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా లభించింది. హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ వాగ్మారే మాయాదేవి పర్యవేక్షణలో “హిందీ దళిత నవలలలో మానవ హక్కులు” అనే అంశంపై విశ్లేషణాత్మక పరిశోధన చేసి గ్రంథాన్ని సమర్పించగా యూనివర్సిటీ అధికారులు పరిశీలించి డాక్టరేట్ పట్టా ప్రకటించారు. ఈ సందర్భంగా రాహుల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, పరిశోధన సహచరులు, బంధుమిత్రులు, గ్రామస్థులు అభినందించారు. ఆయన సాధించిన ఘనత గ్రామీణ యువతకు ఆదర్శమని ప్రేరణగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ మద్నూరే రాహుల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన ప్రజల ఆశాజ్యోతి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, పోరాటాలు నాకు ఉన్నత విద్య సాధనకు ప్రేరణగా నిలిచాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మార్గదర్శకురాలు ప్రొఫెసర్ వాగ్మారే మాయాదేవి, అధ్యాపకులు సంగీత వ్యాస్, మిత్రుల సహకారం వల్లే ఈ విజయాన్ని సాధించాను. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడం నాకు గర్వంగా ఉంది. భవిష్యత్తులో విద్యకు దూరంగా ఉన్న వర్గాల యువత కోసం పనిచేస్తాను అన్నారు