ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ, పార్టీ హైకమాండ్ ఫైర్

Rahul Gandhi and Revanth Reddy meeting
  • కూల్చివేతలపై రేవంత్ రెడ్డి చర్యలకు ఆగ్రహం
  • హైకమాండ్ సూచనలను పట్టించుకోకపోవడంపై మందలింపు
  • కేసీ వేణుగోపాల్ తో వెంటనే భేటీ

 

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ సీనియర్ల సలహాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. రాహుల్, కేసీ వేణుగోపాల్ ను రేవంత్ ని గైడ్ చేయమని ఆదేశించారు, వెంటనే ఇద్దరు మధ్య చర్చలు జరుగాయి.

 

ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, ముఖ్యంగా రాహుల్ గాంధీ, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూల్చివేతలపై పోరాడుతున్న సమయంలో, ఆయన హైద్రాబాద్‌లో కూల్చివేతలకి ఎలా అనుమతి ఇస్తారని రాహుల్ ప్రశ్నించారు.

ప్రస్తుత చర్చలో, రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ల సలహాలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్లడంపై పార్టీ హైకమాండ్ నిరసన తెలిపింది. ఇక్కడ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు ఫోన్ చేసి రేవంత్ ను గైడ్ చేయమని సూచించారు.

తదుపరి, రేవంత్ తక్షణంగా డిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు, ఈ సమావేశం హాట్ హాట్ గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ తీరు పట్ల అధిష్టానానికి పిర్యాదు చేశారు. తమను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఈ చర్యలు ప్రబలమైన వ్యతిరేకతను కలిగిస్తున్నాయని, నీవు చేసే పనులతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు చర్చించారు. రేవంత్ కు తెలియజేస్తున్న వారిలో, పార్టీ పరువు పోకుండా ముందుకు సాగాలన్న సూచన ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment