రాహుల్ గాంధీ.. ఈ చోరీ సంగతేంటి మరి?: కేటీఆర్

రాహుల్ గాంధీ.. ఈ చోరీ సంగతేంటి మరి?: కేటీఆర్

రాహుల్ గాంధీ.. ఈ చోరీ సంగతేంటి మరి?: కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ‘ఓటు చోరీ’ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల కంటే, ‘ఎమ్మెల్యేల చోరీ’ కూడా చిన్న నేరం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి సిగ్గు లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫొటోలు పెట్టి మరీ.. కేటీఆర్ ఇవాళ(శుక్రవారం) సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో హాట్ కామెంట్స్ చేశారు.

తమ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ మార్చిన ప్రతి ఎమ్మెల్యే.. రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలను స్వయంగా కలిశారని కేటీఆర్ ఫొటోలతో సహా పోస్ట్ చేశారు. వారితో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి ‘ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా?’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

‘బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు. మీరు దీన్ని ఒప్పుకుంటారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

‘ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?’ అని ప్రశ్నించిన కేటీఆర్.. దీనికి రాహుల్ గాంధీనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే, ‘ఎమ్మెల్యేల చోరీ’ కూడా చిన్న నేరం కాదని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ద్వంద ప్రమాణాలపై రాహుల్ గాంధీకి సిగ్గులేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

సర్కార్ నడుపుతున్నారా?, సర్కస్ నడుపుతున్నారా?..

సర్కార్ నడుపుతున్నారా?, సర్కస్ నడుపుతున్నారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే, తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది!.’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ లో విమర్శలు గుప్పించారు.

‘మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి’ అని కేటీఆర్.. బాలిక మ్యాన్ హోల్ లో పడిపోతున్న వీడియో ఉంచి ప్రభుత్వాన్ని విమర్శించారు..

Join WhatsApp

Join Now

Leave a Comment