జిల్లాస్థాయి యోగాలో రబింద్రా విద్యార్థుల ప్రతిభ
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 15
మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్రా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇట్టివలే నిర్వహించిన 4వ నిర్మల్ జిల్లాస్థాయి యోగా చాంపియన్ షిప్ – 2015లో ప్రతిభ కనబరిచారు. అండర్-14-16 బాలికల విభాగంలో కే. వాత్సల్య, జి.మధుప్రియ, యస్. యోగేశ్వరీలు ప్రథమ, ద్వితీయ, తృతీయా స్థాయిలో, బాలుర విభాగంలో జె. మహేష్ మొదటి స్థానంలో నిలిచాడు. అండర్ 12-14 బాలుర విభాగంలో కే. మద్నేష్ మొదటి స్థానంలో, బాలికల విభాగంలో శ్రేయ నాలుగో స్థానంలో రాణించగా జోయ ఫిర్దోస్, జె.స్పందన 6,7 స్థానాలో సత్తాచాటారు. అంతే కాకుండ అండ-12 బాలికల విభాగంలో ఫమన్ అమానియా 5వస్థానం సంపాదించారు. జిల్లాస్థాయి యోగ పోటీలు తానూర్ లో నిర్వహించారు. మంచి ప్రతిభనుకనపరిచి, బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్, కరెస్పాండెంట్ రాజేందర్, ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు