ఆదర్శ పాఠశాల సర్కారు బడిలో నాణ్యమైన విద్య
జనతన్యూస్ మే 6 కుంటాల భైంసా: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జెడ్ పి ఎస్ ఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతమే నిదర్శనం అనిఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో టాపర్లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ ఉపాధ్యాయుల బృందం, ఉపాధ్యాయులు నాయకులు తదితరులు పాల్గొన్నారు