కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి
….కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
…..డిల్లీలో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ స్థాపనపై చొరవ తీసుకోవాలని రాంమోహన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల
…. భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఎయిర్ పోర్ట్
…… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.మంగళవారం నాడు డిల్లీలో రాoమోహన్ నాయుడు ను కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై చర్చించారు.కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరపున ఫీజు బులిటీ సర్వే చేసినందుకు రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.ఫీజుబులిటీ సర్వే లో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేశామని అక్కడ త్వరగా ఫీజుబులిటీ సర్వే చేసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
….. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.
జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్..ఐటీసీ
బీ. పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజం కు కేరాఫ్ గా నిలిచింది.దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం.గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం లో చొరవ తీసుకోవాలని రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడ్డైన రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ పర్యటన లో భాగంగా కేంద్ర భారీ పారిశ్రామల,ఉక్కు మంత్రి హెచ్. డి కుమారస్వామి ని కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చిన మంత్రి తుమ్మల.
ఈ అంశంపై త్వరలోనే సమావేశం అవుదామని తెలిపిన కేంద్ర మంత్రి కుమార స్వామి.