ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి
ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్
మనిరంజని ప్రతినిధి
లోకేశ్వరం : ఫిబ్రవరి 07
విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు పటేల్ అన్నారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం-మన్మద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-రాజురా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తరుపున ట్రస్ట్ ఛైర్మెన్ మోహన్ రావ్ పటేల్ గ్రామస్థుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చదివేమెళకువలు అనుసరించాలని వివరించారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు పై చదువులు చదవడానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే మా ప్రజా ట్రస్ట్ సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు మోహన్ రావ్ పటేల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అధ్యాపకులు, ట్రస్ట్ టీం సభ్యులు, లోకేశ్వరం మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గోన్నారు