అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలి
బైంసా ఏఎంసి చైర్మన్ ఆనందరావు పటేల్
మనోరంజని ప్రతినిధి
బైంసా : జనవరి 24
ప్రభుత్వ పథకాలను అర్హులకు అందే విధంగా చూడాలని బైంసా ఎఎంసి చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ అన్నారు. మండలంలోని పాంగ్రి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు-ఇంద్రమ్మ ఇండ్లు- రైతు భరోసా- ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.
పేదల పక్షన నిలబడి పేదల కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. అక్కడ ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వారు ఆహార భద్రత కార్డు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇల్లు లేని పేదవారు అప్లై చేసుకుని ఇంద్రమ్మ ఇండ్లను- రైతు భరోసా- ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా 12 వేల రూపాయలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, అధికారులు, రైతులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు