రాయపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి గర్వకారణం – మొహమ్మద్ అస్గర్కి ‘బెస్ట్ ఎంప్లాయీ’ అవార్డు
రాయపర్తి, ఆగస్టు 15:
రాయపర్తి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 సంవత్సరాలుగా కర్తవ్యనిష్ఠ, అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్ సిబ్బంది మొహమ్మద్ అస్గర్ గారిని, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ‘బెస్ట్ ఎంప్లాయీ’ అవార్డుతో సత్కరించడం పట్ల సహచర సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో, ఎప్పుడూ ముందుండే మొహమ్మద్ అస్గర్ గారు అత్యవసర సమయాల్లోనూ, పండుగ రోజులలోనూ, అర్ధరాత్రి పిలుపులకూ వెంటనే స్పందిస్తూ, రోగుల ఆరోగ్యాన్ని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని పనిచేస్తారని సహచరులు తెలిపారు. ఆయన సత్కారం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంతోష వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యూనిస్ ఖాన్, సిబ్బంది రవి, షామ్తో పాటు పలు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అవార్డు అందుకున్న అనంతరం మొహమ్మద్ అస్గర్ మాట్లాడుతూ –
“ఇది నా జీవితంలో మరపురాని రోజు. నా సేవలను గుర్తించిన రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు మరింత కర్తవ్యబద్ధత, సేవా తపనను పెంచుతుంది” అని పేర్కొన్నారు.
స్థానిక ప్రజలు కూడా ఆయన సేవలను అభినందిస్తూ, “ఇలాంటి నిబద్ధత కలిగిన సిబ్బంది ఉండటం రాయపర్తి మండలానికి గర్వకారణం” అని ప్రశంసించారు