బాసర అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడాలి – ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ వినతిపత్రం సమర్పణ

బాసర అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడాలి – ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ వినతిపత్రం సమర్పణ

మనోరంజని ప్రతినిధి భైంసా, సెప్టెంబర్ 09 –
నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం, చదువుల తల్లి అమ్మవారి గోదావరి నది తీరాన జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ స్పందిస్తూ వినతిపత్రాన్ని సమర్పించింది.

ఈ కార్యక్రమం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించబడింది. జిల్లా సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

జిల్లా అధ్యక్షుడు కదం నాగేందర్ పటేల్ మాట్లాడుతూ:
“భక్తులకు ఇబ్బందులు కలగకుండా, దేవస్థానంలో ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించి, భక్తులకు సకల సౌకర్యాలు అందించాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, శుభ్రంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.”

వినతిపత్రంలో ముఖ్యంగా పేర్కొన్న అంశాలు:
✔️ భక్తుల వద్ద నుండి దుకాణదారులు అధిక చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి.
✔️ లాడ్జి యజమానులు భక్తులకు అధిక చార్జీలు వసూలు చేయకుండా చూసుకోవాలి.
✔️ ఘాట్ల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి.
✔️ అమ్మవారి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

నిర్మల్ జిల్లా అధ్యక్షులు కదం నాగేందర్ పటేల్

జిల్లా కార్యదర్శి జెల్ల హన్మండ్లు

భైంసా పట్టణ అధ్యక్షుడు సుంకేట శ్రీనివాస్

ఇతర కార్యకర్తలు మరియు సభ్యులు.

ప్రతిష్టాత్మక బాసర అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడడం, భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ వినతిపత్రం సమర్పించబడినది.

Join WhatsApp

Join Now

Leave a Comment