ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి ఘనంగా
కంటేశ్వర్‌లో విగ్రహానికి పూలమాల వేసిన బీఆర్ఎస్ నేతలు – ప్రజలకు శుభాకాంక్షలు
తెలంగాణ ఆత్మగౌరవ యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకుని నిజాంబాద్ జిల్లా కంటేశ్వర్‌లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నిజాంబాద్ టౌన్ తరపున శిరపరాజు గారు, మరియు జిల్లా తరపున మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్న గారి విట్టల్ రావు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ స్పూర్తి తరతరాలకూ మార్గదర్శకమని నేతలు అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఈ కార్యక్రమంలో నూడ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, నీలం రెడ్డి, చింతకాయల రాజు, విజయ్, ప్యాట్ సంతోష్, గంగామణి, మాకు రవి, న్యాలం రమేష్, రాజు, సంతోష్, విట్టల్ దాదా, అగ్గు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ జయంతి వేడుక తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను నెమరేసేలా, నాయకుల కట్టుబాటును మరోసారి గుర్తు చేసేలా సాగింది.