- మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానం
- గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం
- కుంభమేళా ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు
- ఇప్పటి వరకు 38 కోట్ల మంది భక్తుల రద్దీ
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రధాని ప్రయాగ్‌రాజ్ పర్యటన ముగిసింది. మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగియనుంది. ఇప్పటి వరకు 38 కోట్ల మంది భక్తులు ఈ మహాసంగమానికి హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందిన మహాకుంభమేళా ఉత్సవాలు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహా కుంభమేళాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరై పుణ్యస్నానం ఆచరించారు.
బుధవారం ఉదయం ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు వెళ్లారు. అనంతరం బోటులో మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహాకుంభమేళా విశిష్టతను ప్రశంసించారు. భద్రతా దృష్ట్యా ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా ప్రాంతంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగియనుంది.
ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు 38 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా మహాకుంభమేళాకు హాజరవుతున్నారు.