చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ
ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల్లో ప్రధాని మోడీ మరో రికార్డు సృష్టించారు. 12వ సారి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, ఏకధాటిగా 103 నిమిషాల పాటు మాట్లాడారు. గతేడాది 98 నిమిషాల తన రికార్డును తానే బద్దలుకొట్టారు. గతంలో 1947లో నెహ్రూ 72 నిమిషాలు, 2005లో మన్మోహన్ సింగ్ 50 నిమిషాలు ప్రసంగించారు.