నిర్మల్ వాసికి దక్కిన ప్రైడ్ అఫ్ తెలంగాణ అవార్డు
మనోరంజని ప్రతినిధి, నిర్మల్ సెప్టెంబర్ 29
హైదరాబాద్‌లో జరిగిన ప్రైడ్ అఫ్ తెలంగాణ అవార్డ్స్ 2025లో నిర్మల్ పట్టణానికి చెందిన ముత్యం సాయివీర్ కుమార్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న లీగ్‌టెక్ మరియు ఫిన్‌టెక్ సాస్ ప్లాట్‌ఫాం వైడర్ (Wider), ఉత్తమ స్టార్టప్ విభాగంలో “ప్రైడ్ అఫ్ తెలంగాణ 2025” అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించింది. ఆటోమేషన్ ద్వారా వృత్తిపరమైన సేవల రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంలో వైడర్ స్థాపకుడిగా సాయివీర్ కుమార్ కీలకపాత్ర పోషించారు.
ఈ అవార్డులను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నటుడు సుధీర్ బాబు విజేతలకు బహూకరించారు.
కార్యక్రమంలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పి. రఘురామ్, ఐటీ రంగ నిపుణులు రమేష్ కాజా, సృష్టి ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, టీ-హబ్ మాజీ సీఈఓ శ్రీనివాస్ మహంకాళి, రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు జి. సిద్ధార్థ్, వీనిషుప్తా తదితరులు పాల్గొన్నారు.