విజయసాయి స్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
జనత న్యూస్ సెప్టెంబర్ 18 కుంటాల: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని విజయ సాయి స్కూల్లో ప్రిన్సిపల్ సప్న గురువారం పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలను పాడుతూ సంప్రదాయంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు